యూపీలోని జ్ఞానవాపి మసీదు కింద అతిపెద్ద ఆలయం ఆనవాళ్లను గుర్తించినట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ASI) సంచలన విషయాలు వెల్లడించింది. ఆలయ స్తంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించినట్లు తమ సర్వేలో తేలినట్లు తెలిపింది. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చినట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కంది. తెలుగు భాషతో పాటు 32 కీలక శాసనాధారాలు లభ్యమయ్యాయని వివరించింది.
