‘హనుమాన్’ మూవీకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని తీసుకోనున్నట్లు తాజాగా ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఇందుకు సంబంధించి బాలీవుడ్ హీరోల నుంచి ఆడిషన్స్ కూడా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరో ప్రకటించనున్నట్లు చెప్పారు.
