మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు. ఫ్యామిలీకి, ఫ్యాన్స్‌కు, తెలుగు ప్రజలకు ఇదొక గొప్ప గౌరవం. ఈ విజయంతో మమ్మల్నందరినీ ఎంతో గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.
