UPDATES  

 శిశు సంక్షేమ శాఖా మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు…

.

మన్యం న్యూస్, మంగపేట.

 

గ్రామ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని శనివారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క ని అకినేపల్లి మల్లారం కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్ మైనుద్దీన్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామానికి కావలసిన సిసి రోడ్, సైడ్ డ్రైనేజ్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం లో పేర్కొన్నారు.

వెంటనే స్పందించిన మంత్రి సీతక్క తప్పకుండా గ్రామ అభివృద్ధి కి నిధులు మంజూరు చేస్తానని ఏ సమస్య ఉన్న తనకు తెలియజేయాలి అని సత్వరమే పరిష్కార0 కొరకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మంత్రి పదవి చేపట్టిన అనంతరం మొదటిసారి గ్రామ కాంగ్రెస్ నాయకులు కలిసి శాలువా కప్పి పుష్ప గుచ్చo అందించి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ ఉపాధ్యక్షులు ధూళిపాల బాలకృష్ణ,గ్రామ ఎస్సీ సెల్ కార్యదర్శి చెట్టుపల్లి చౌదరి, రవి,రాజు,దూలగొండ నారాయణ,ఇనుముల నర్సింగరావు,దాసరి ఈశ్వర్,ఎస్టీ సెల్ నాయకులు సేగ్గెం వెంకటేశ్వర్లు గ్రామ యూత్ నాయకులు చెట్టుపల్లి నర్సింగరావు, బిలపాటి ప్రేమ కుమార్, ఇనుముల ప్రశాంత్ పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !