ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ సీఎం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆప్‌కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించిందని బాంబు పేల్చారు.
ఈ మధ్యే ఆప్‌కి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను బీజేపీ నేత సంప్రదించారని కేజ్రీవాల్ తెలిపారు. లిక్కర్ కేసులో మరికొద్ది రోజుల్లో తనని అరెస్టు చేస్తారంటూ.. తమ ఎమ్మెల్యేలను బెదిరించారని పేర్కొన్నారు. తన అరెస్టు తర్వాత ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పారన్నారు. పార్టీ మారితే తమ ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్‌తో పాటు 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని తెలిపారు. తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని.. బీజేపీ ఈ కుట్ర రాజకీయాలు మానాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.