అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ మూవీతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ఫేవరెట్ హీరో గురించి చెప్పుకొచ్చింది. ‘మీకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే బాగా ఇష్టం’ అని యాంకర్ ప్రశ్నించగా, ‘ఇండస్ట్రీలో నాకు అందరూ హీరోలు ఒకటే. కానీ, ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఆయనే నా ఫేవరెట్ హీరో‘ అంటూ ఐకాన్ స్టార్‌పై ఉన్న ప్రేమను బయటపెట్టింది.
