కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా రాకేశ్ ఓం ప్రకాశ్ దర్వకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్ణ’. మహాభారతం ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తుండగా, సూర్య కర్ణుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించనున్నట్లు వార్తలోస్తున్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు.
