మన్యం న్యూస్ వాజేడు..
ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగుడెం గ్రామం లో ఉన్న గట్టిపల్లి లక్ష్మణ్ రావు (తిమోతి)- అన్నపూర్ణ దంపతులకు ఏకైక కుమార్తె, గట్టిపల్లీ షైనీ, 28 వ తారీకు మంచిర్యాల జిల్లా లో జరిగిన పి.ఎస్.ఆర్ అధ్వర్యంలో (అల్ స్టైల్స్ (కరాటే – కుంగ్ ఫు) జాతీయ స్థాయి లో పి.ఎస్.ఆర్ కరాటే కప్ నిర్వహించడం జరిగింది.అందులో అండర్ 14 లో కరాటే మాస్టర్లు సమక్షం లో కరాటే పోటీలలో పాల్గొన్నారు. అందులో గట్టుపల్లి షైనికి మొదటి స్థానం సాధించగా గోల్డ్ మెడల్, జాతీయ స్థాయి సర్టిఫికేట్ అందుకోవడం జరిగింది. భూపాలపల్లి జిల్లా మేడిపల్లి గ్రామం లో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినీ.ఈ సందర్భంగా పాటశాల ప్రధానోపాధ్యాయులు,టీచర్స్ అందరూ విద్యార్థినికి అభినందనలు తెలిపారు. ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్నో మన స్కూల్ కి తీసుకు రావాలని అభినందించి ప్రోత్సహించడం జరిగింది.తల్లి తండ్రులు కూతురు పొందుకున్న జాతీయ స్థాయి లో మొదటి స్థానం సాధించడంలో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.





