మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన జిగట లక్ష్మయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మృతుని నివాసనికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొమరం కాంతారావు,కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగబండి.వెంకటేశ్వర్లు, నాయకులు ఎల్లబోయిన.సత్యం,బుచ్చయ్య,వడ్లకోండ.సాంబశివరావు,దొంతు.మల్లయ్య, ఇర్ప.సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.