- ఘనంగా మహాత్మా గాంధీ 76వ వర్ధంతి వేడుకలు.
- మహాత్మ గాంధీ విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ,జిల్లా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా.లింగయ్య దొర
మన్యం న్యూస్ కరకగూడెం:మహాత్మా గాంధీ 76వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని మండల పరిధిలోని మహాత్మా గాంధీ స్మారక ట్రస్ట్ మేనేజర్ నాగబండి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి గాంధీ స్మారక నిధి స్టేట్ బోర్డు చైర్మన్ జివి సుబ్బారావు,స్టేట్ బోర్డు సెక్రటరీ కె.రంగారావు,స్టేట్ బోర్డు మెంబర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్,మాజీ ఎమ్మెల్యే చందా.లింగయ్య దొర అయన విగ్రహాన్నికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయలను తరిమికొట్టిన సమరయోధుడు యావత్ ప్రపంచానికే స్పూర్తి ప్రదాత జాతిపిత మహాత్మా గాంధీని ఆయన చూపిన మార్గం ద్వారానే ఏదైనా సాధించవచ్చును నిరూపించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అన్నారు. సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం సర్పంచ్ ఉకే.రామనాదం,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు, ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.