UPDATES  

 అట్ట ఆసంగ వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం…గ్రీన్ ఫీల్డ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మానాల వెంకటేశ్వర్లు..

  • అట్ట ఆసంగ వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం
  • గ్రీన్ ఫీల్డ్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మానాల వెంకటేశ్వర్లు

మన్యం న్యూస్ గుండాల గుండాల మండల కేంద్రంలో వాసవి క్లబ్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ నూతన ప్రమాణస్వీకారోత్సవాన్ని ఘనంగా బుధవారం నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ అధ్యక్షుడిగా గుండాల గ్రామానికి చెందిన మానాల వెంకటేశ్వర్లు ప్రమాణస్వీకారాన్ని చేసి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ పోలిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ సమాజ సేవలో వాసవి క్లబ్ ముందుందని అన్నారు ఇతర క్లబ్బులకు భిన్నంగా సేవే మార్గం సేవే లక్ష్యం అనే నినాదంతో లక్షలాది రూపాయల ఆర్థిక సహాయంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా క్లబ్బులను విస్తరించి సమాజ సేవలో ముందుంటుందన్నారు మారుమూల ప్రాంతమైన గుండాలలో కూడా నూతన క్లబ్ ఏర్పాటు చేసుకొని ఘనంగా ప్రమాణస్వీకారంతోపాటు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలతో పాటు అనేక పథకాలు ఏర్పాటు చేసి నిరుపేద ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తుంది అన్నారు.సమాజంలో నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు దినదిన పరావర్తమానంగా వాసవి క్లబ్బులు గ్రామ గ్రామాన వెలుస్తూ సమాజ సేవ చేస్తూ ముందుంటున్నాయన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మానాల వెంకటేశ్వర్లు.. అనుములు వెంకటేశ్వరరావు. పుల్ల కాండం ఉపేందర్ తోపాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !