UPDATES  

 బాలయ్యతో ఊర్వశి…

నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి రెండు సినిమాతో సూపర్ హిట్లు అందుకున్నారు. ఈ సినిమాల జోష్‌లోనే మరో డైరెక్టర్‌ బాబీకి గ్నీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు ‘NBK109’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో బాలయ్యను ఎన్నడూ చూడని విధంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.

 

అయితే ఇందులో బాలయ్యతో తలపడాలంటే ఆయనలాంటి గంబీరమైన నటులే ఉండాలి. అంతటి పవర్ ఫుల్ కాబట్టే ఈ సారి ‘యానిమల్’ విలన్‌ని మేకర్స్ రంగంలోకి దింపారు. ‘జమల్.. జమల్’ సాంగ్‌తో ఓ ట్రెండ్ సెట్ చేసిన నటుడు బాబీ డియోల్.. ఇప్పుడు ‘NBK109’ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ నటుడితో పాటు మరో బాలీవుడ్ బ్యూటీ ఈ మూవీలో భాగం కానుంది.

 

‘వాల్తేరు వీరయ్య’లో చిరుతో ‘బాస్ పార్టీకి’ చిందులేసిన నటి ఊర్వశి రౌటెలా ఈ మూవీలో నటించనుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించనున్నట్లు ఆమె తాజాగా ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఈ మేరకు అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (UFC) విజేత కోనార్ మెక్‌గ్రెగర్‌తో కఠోర శిక్షణ పొందుతున్న ఫొటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు రకరకాల స్పందిస్తున్నారు. బాలయ్యతో సినిమా అంటే ఈ మాత్రం ఉంటుందని అని కామెంట్లు చేస్తున్నారు.

 

కాగా ఈ మూవీలో బాలయ్యకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా, పాయల్ రాజ్‌పుత్, దుల్కర్ సల్మాన్, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !