మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల దేశ ద్వితీయ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవిని తన నివాసంలో కలిసి పద్మవిభూషణ్ అవార్డు లభించిన సందర్భంగా పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కలయిక ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
