యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఆ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక సినిమా షూటింగ్ కూడా పలు కారణాల వల్ల ఆగిపోయింది. కాగా ఫిబ్రవరి రెండో వారం నుంచి సినిమా షూటింగ్ మళ్లీ షురూ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి 30 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇది పూర్తయిన తర్వాత చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.
