ఇప్పటివరకు కథా బలమున్న చిత్రాల్లో నటించడం వల్ల తనలోని డ్యాన్సర్‌ను చూపించే అవకాశం రాలేదని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘నేను సీరియస్ స్టోరీల్లో ఎక్కువగా నటించా. దాంతో ఉర్రూతలూగే డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. ‘సూపర్30’లో హృతిక్ రోషన్ తో, జెర్సీలో షాహిద్ కపూర్‌తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. ఆ లోటును ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా తీరుస్తోంది’’ అని తెలిపారు.
