బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.! ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. ఏడాదిన్నరగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా ఇంత వరకు అప్డేట్ లేకపోవడంపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తీరుపై చెర్రీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం ఏంటని, ఇప్పటికైనా అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు
