నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అడ్డంగా బుక్కైంది. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..యంగ్ స్టార్ రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన కన్నడ చిత్రం `కాంతార`. ఇందులో సప్తమిగౌడ హీరోయిన్‌గా నటిస్తుంటే.. కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, ప్రమోద్‌శెట్టి తదితరులు కీలక పాత్రలను పోషించారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలైన సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేశాడు. అయితే విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాపై ప్రేక్షకులే కాదు ఎందురో సెలబ్రెటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. rashmika mandanna ఈ మూవీతో ఒక దర్శకుడిగా మరియు హీరోగా రిషబ్ శెట్టి పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా గురించి రష్మిక ఏమీ మాట్లాడకపోవడమే వివాదంగా మారింది. ఎందుకంటే, రష్మికను హీరోయిన్‌గా పరిచయం చేసింది మరెవరో కాదు రిషబ్ శెట్టినే. అవును, రష్మిక తొలి సినిమా `కిరిక్ పార్టీ`కి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆయన దర్శకత్వం వహించి, నటించిన `కాంతార` చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. ఇంత జరుగుతున్నా రష్మిక నోరు మాత్రం విప్పలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి దర్శకుడినే రష్మిక మరచిపోయిందంటూ రష్మికపై నెటిజన్లు మండిపడుతున్నారు.