బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాదవశాత్తు కిందపడి తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరగడంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. దీంతో గురువారం మధ్యాహ్నం 12.45 గంటలకు శాసన సభాపతి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు.
