‘పొగరు’ సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్న శ్రియారెడ్డి.. తాజాగా ‘సలార్’ మూవీతో ఇండస్ట్రీలో వైరల్‌గా మారిపోయింది. ఈ మూవీలో శ్రియారెడ్డి రాజ మన్నార్(జగపతిబాబు) మొదటి భార్య కూతురు రాధ రాజమన్నార్‌గా నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో శ్రియారెడ్డికి వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘ఓజీ’ సినిమాతో బిజీగా ఉన్నారు.
