ప్రపంచంలోని అవినీతి దేశాల జాబితా తాజాగా విడుదలైంది. 180 దేశాల జాబితాలో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో సోమాలియా, సిరియా, యెమెన్ ఉన్నాయి. అతి తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే 93వ స్థానంలో ఉంది. ఈ జాబితాను జర్మనీలోని బెర్లిన్‌కు చెందిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది