మన్యం న్యూస్ గుండాల: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, సాధ్యం కానిది ఏది ఉండదని ముగ్గురు వనిత మనులు నిరూపించారు. మండల కేంద్రంలో నీ ప్రాథమిక వైద్యశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు మోకాళ్ళ స్వాతి, కే మాధవి, బి లావణ్య తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన స్టాప్ నర్సు కొలువు ఫలితాలలో కొలువు సాధించారు. వీరికి స్థానిక వైద్యశాల సిబ్బంది డాక్టర్ మనిష్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన సభను ఏర్పాటు చేసి వారిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శ్రీహరి, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు
