తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ ప్రకటించారు. అలాగే, తన చివరి సినిమా ఏదో కూడా హింట్ ఇచ్చేశారు. రాజకీయ రంగ ప్రవేశం ప్రకటించటంతో దళపతి విజయ్ ఆఖరి సినిమా ఏదన్న ఆసక్తి నెలకొంది. అయితే.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‍టైమ్’ తర్వాత ఇంకో సినిమా చేస్తానని తన ప్రకటనలో విజయ్ పేర్కొన్నారు. ఇది విజయ్‍కు 69వ మూవీగా ఉండనుంది.
