స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న ఆమె వారి పెళ్లి గురించి ఎన్ని వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వీరిద్దరి పెళ్లి ఈ నెల 21న జరగనుంది. సినీ ప్రముఖులు, స్నేహితులకు ఆహ్వాన పత్రిక పంచినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు పెళ్లి తంతు కోసం గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్టులో వేదికను సిద్ధం చేశారట.
