నక్సలిజం నేపథ్యానికి కాస్త సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రం ’రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం‘. జైదీప్ విష్ణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, ప్రముఖ యూట్యూబర్ జయేత్రి, వినీత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషంచారు. గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన తుపాకుల గూడెం ఓ మోస్తరుగా ఆడింది. కొందరు సినిమా కాన్సెప్ట్ బాగుందని కితాబివ్వడంతో ఈటీవీ విన్ లో ఈ నెల 8న విడుదల చేస్తున్నారు.





