మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్’ నుంచి క్రేజీ అప్‌డేట్ అందించారు మేకర్స్. రేపు ఈ సినిమా నుంచి చిన్న వీడియోను విడుదల చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. దీంతో రేపు టిల్లు స్క్వేర్ టీజర్ రాబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ మూవీ మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది.





