జబర్ధస్త్ వేణు ‘బలగం’ సినిమాతో పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుని డైరెక్టర్గా సత్తా చాటారు. ఈ క్రమంలో వేణు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, తాజాగా ఓ ఇంట్వర్యూలో పాల్గొన్న వేణు మాట్లాడుతూ ‘బలగం’ విజయం తనపై కొత్త బాధ్యతలు వచ్చాయని, ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. అందరికీ నచ్చేలా కొత్త కథ రాసినట్లు తెలిపారు. త్వరలోనే మంచి సినిమాతో వస్తానని అన్నారు.





