మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామం లో మన్యం న్యూస్ రిపోర్టర్ ఇటీవల మైపా శంకర్ దుర దృష్టవశాత్తు గాయపడగా మంగపేట మండలం మానవ హక్కుల సంఘం సభ్యులు పాత్రికేయుడికి ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని, పండ్లు,ఆర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమం లో మానవ హక్కుల సంఘం అధ్యక్షులు మధుకర్ తో మండలం ప్రధాన కార్యదర్శి కర్రి శ్రీను, బోడ ప్రవీణ్, కౌషర్ పాషా, గాజ నరసింహారావు,సంపత్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.