మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం లోని రాజుపేట గ్రామం లో షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం సంబవించి సర్వస్వం కోల్పోయిన మోదుగు రాములు కుటుంబానికి మానవ హక్కుల సంఘం మంగపేట అధ్యక్షులు, మధుకర్, ప్రధాన కార్యదర్శి కర్రి శ్రీను, రాజుపేట అధ్యక్షులు కౌసర్ పాషా ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం, నిత్యావసర వస్తువులు అందించిన అనంతరం మానవ హక్కుల సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మోదుగు రాములు కుటుంబానికి ఏదో ఒక విధంగా సహాయం అందించాలని ప్రార్థన చేసే పెదవుల కన్నా, సహాయం చేసే చేతులు మిన్న అని తెలియజేశారు.