సర్వైకల్ క్యాన్సర్ ప్రచారకర్తగా పూనమ్ పాండే పేరును కేంద్రం పరిశీలిస్తోందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పూనమ్ పాండే, ఆమె టీమ్ చర్చలు జరుపుతోందని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పూనమ్ పాండేని బ్రాండ్ అంబాసిడర్‌గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
