మన్యం న్యూస్, మంగపేట.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి గ్రామం లో ఒక దళిత మహిళ ను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి కారం కొట్టి దారుణంగా హింసించి సభ్య సమాజం తల దించు కొనేలా ప్రవర్తించిన వారు ఎంత గొప్ప వారైనా, ఎటువంటి రాజకీయ బలం ఉన్న, ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా వారిని పట్టుకొని జైల్లో పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని చట్టం ఎవరికీ చుట్టం కాదని నిరూపించు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై, పోలీస్ లపై ఉంది. కామారెడ్డి, మాచారెడ్డి మండలం లో జరిగిన సంఘటన వెనుక ఆ స్త్రీ ఎటువంటి తప్పు చేసిన ఆమె ను శిక్షించే హక్కు చట్టానికి ఉంది, అంతే తప్ప అనాగరికంగా, విచక్షణ మరచి ఇలా ప్రవర్తిస్తే దీనిని ప్రజాస్వామ్యం అనరు, రక్షణ కరువైన రాక్షస పాలనా అంటారు, ఈ సంఘటన పునరావృతం కాకుండ దోషలు ఎవరు అయినా కఠినంగా శిక్షించి ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని సామాజిక కార్యకర్త మైపా శంకర్ కోరారు.