మన్యం న్యూస్ గుండాల: ఈనెల 13వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, యువజన నాయకులు, విద్యార్థి నాయకులు స్వచ్ఛందంగా హాజరవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఈ సభకు అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారని అన్నారు
