సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత జోడీ శనివారం తమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేశ్, నమ్రత ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ‘హ్యాపీ యానివర్సరీ నమ్రత’ అంటూ పెళ్లికి సంబంధించిన ఫొటోను మహేశ్ షేర్ చేశారు. దీనికి ఆమె ‘లవ్ యూ’ అని రిప్లై ఇచ్చారు. నమ్రత కూడా ఇన్స్టాలో ఓ ఫొటో అభిమానులతో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
