మన్యం న్యూస్, మంగపేట.
మేడారం అనగానే గుర్తుకు వచ్చేది కొండలు, కోనలు,ప్రకృతి అందాలు, జాలువారే, జలపాతాలు,ప్రవహించే సెలయేరులు ఇవి అన్ని కూడా మేడారం జాతరలో రేఖా ఆర్ట్స్ కలం పేరుతో కర్రీ కేశవ రావు అనే చిత్ర కళాకారుడి కుంచె నుండి జాలు వారిన మాయాజాల చిత్రాలు.
మంగపేట మండలం, రాజుపేట గ్రామానికి చెందిన చిత్ర కళాకారుడు గత 30 సంవత్సరాలనుండి అద్భుతంగా విభిన్న చిత్రాలు గీస్తూ, గోడల మీద రాతలు రాస్తూ ఎంతోమంది నుండి మెప్పు పొందాడు. ఇతను రేఖ ఆర్ట్స్ అనే పేరుతో వేల సృజనాత్మక చిత్రాలు గీసి అలరించాడు. ఇప్పుడు మేడారం లో ఇరువైపులా ఎక్కడ చూసినా పచ్చదనం, చెట్లు, పక్షులు, మృగాలు, జింకలు, అమాయక గిరిజన విధానం,ప్రకృతి, పల్లె అందాలు ఇటువంటి అద్భుతమైన, అమోఘమైన చిత్రాలు మనం మేడారం లో చూడవచ్చు.