UPDATES  

 జాతీయ క్రీడలకు చర్ల ఏకలవ్య విద్యార్థులు ఎంపిక.. పలు క్రీడల్లో బంగారు, రజిత పథకాలు..

  • జాతీయ క్రీడలకు చర్ల ఏకలవ్య విద్యార్థులు ఎంపిక
  • పలు క్రీడల్లో బంగారు, రజిత పథకాలు
  • విద్యార్థులకు, వ్యాయామ ఉపాధ్యాయులపై పలువురు ప్రశంసలు

మన్యం న్యూస్ చర్ల:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడలలో సత్తచాటి రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక అయ్యారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న అన్ని స్కూలు విభాగాలలో నుంచి జిల్లా స్థాయి క్రీడలలోని ఎస్ జి ఎఫ్ ఐ బెస్ బాల్ అండర్ 14 స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ముగ్గురు విద్యార్థులు ఎంపీక కావడం జరిగింది.అదేవిధంగా అమిచ్చర్ అసోసియేషన్ ఆఫ్ రిజెలింగ్ క్రీడ లో విద్యార్థులు ప్రతిభ చాటి ఐదు బంగారు పథకాలు,మూడు రజత పథకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ నెలలో 7,8 తేదీల్లో జే ఎన్ స్టేడియం హన్మకొండ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి మూడు రజిత పథకాలు సాధించి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక అయ్యారు. బీచ్ వాలీబాల్, లాంగ్ టెన్నిస్, స్క్వేస్ వాలీబాల్, బాక్సింగ్, ఆర్చరీ వంటి క్రీడలలో తమ సత్తా చాటుతూ ఉత్తమమైన ప్రతిభను కనుబరుస్తున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయికి ఎన్నికైన విద్యార్థిని విద్యార్థులకు డిప్యూటీ సెక్రటరీ వి చంద్రశేఖర్, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్య నాయక్, ప్రిన్సిపాల్ ఎం శకుంతల, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి, అధ్యాపకుల బృందం హర్ష వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

వ్యాయామ ఉపాధ్యాయుడి వెంకటేష్ శిక్షణ భేష్

ఆ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎక్కడున్నా క్రీడలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో విద్యార్థులు ఉత్తమమైన ప్రతిభ కనపరుస్తూ బంగారు, రజత పథకాలు సాధిస్తున్నారు. విద్యార్థుల నైపుణ్యాన్ని గమనించి దాన్ని క్రీడలలో తీర్చిదిద్ది విద్యార్థుల స్థాయిని బట్టి వారికి ఆడు క్రీడలలో తగు మెలకువలు నేర్పించి ఉత్తమమైన ఫలితాలు అన్ని క్రీడా విభాగాలు చూపిస్తూ ది బెస్ట్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర స్థాయిలో పలువురు నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆయనే చర్ల ఏకలవ్య మోడల్ స్కూల్ లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి హెచ్ వెంకటేష్. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను వెలిగితీస్తూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచేలా తీర్చిదిద్దుతున్న వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేష్ కు ప్రిన్సిపాల్ శకుంతల ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి ఈ టి అరుణ, స్కూల్ బృందం తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !