హీరోయిన్ సాయి పల్లవి తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద హీరో చిత్రాన్ని అయినా నిరాకరిస్తారు. ఈ క్రమంలో కెరీర్‌లో ఆమె నటించిన సినిమాల కంటే తిరస్కరించిన సినిమాలే ఎక్కువ. అయితే, అలా ఆమె తిరస్కరించిన చాలా చిత్రాలు బాక్సాఫీసు వద్ద అపజయాలుగా నిలిచాయి. చంద్రముఖి 2, భోళా శంకర్, డియర్ కామ్రేడ్, వలిమై, సరిలేరు నీకెవ్వరు, లియో సినిమాల్లో హీరోయిన్‌గా సాయి పల్లవి పేరు వినిపించింది. కానీ ఈ సినిమాల్లో ఆమె నటించలేదు.