పుష్ప సినిమా పాన్ ఇండియా వైడ్ ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ’పుష్ప 2‘ సినిమాని ఆగస్టు 15 పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. కానీ ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక తీసిన సుకుమార్ ఫోటోని పుష్ప అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆగస్టు 15కి పుష్ప 2 రిలీజ్ అవుతుందని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.