నటి రకుల్ ప్రీత్‌సింగ్, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ ఈ నెల 21న వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుపు, నీలం రంగుల్లో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ముద్రించారు. అలాగే కార్డుపై ‘అబ్‌దోనోభగ్నా-ని’అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ప్రింట్ చేశారు. వీరి పెళ్లి గోవాలో నిర్వహిస్తున్నారు.