ఛలో ఢిల్లీ మార్చ్ కోసం రైతులంతా ప్రిపేరయ్యారు. పంజాబీ రైతులు వేలాది సంఖ్యలో ఉన్న ట్రాక్టర్లలో ఢిల్లీ బాటపట్టారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన రైతు సంఘాలు ఇప్పుడు కనీస మద్దతు ధర చట్టం కోరుతూ దేశరాజధానికి వెళ్తున్నారు. కనీసం 6 నెలలకు సరిపడా ఉన్న రేషన్‌తో ట్రాక్టర్లు బయలుదేరుతున్నాయి. అంబాలా-శంభూ, కనౌరి-జింద్, దాబ్‌వాలీ బోర్డర్ రూట్లో ఆ ట్రాక్టర్లు ముందుకు వెళ్తున్నాయి.