మన్యం న్యూస్ గుండాల: కేంద్ర ప్రభుత్వం రైతు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతామని తుడుం దెబ్బ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు కోడెం వెంకటేశ్వర్లు అన్నారు. ఈనెల 16వ తారీఖున జరిగే రైతు సంఘాలు తలపెట్టిన బందుకు సంపూర్ణ మద్దతు తెలిపామని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరారు
