మన్యం న్యూస్ మంగపేట.
మేడారం మహా జాతర సందర్బంగా మంగపేట లో మేడారం వెళ్లే భక్తుల సౌకర్యం దృష్టిలో పెట్టుకొని తహసీల్దార్ వీరాస్వామి రైతు వేదిక వద్ద తాత్కాలిక బస్సు స్టాప్ ఏర్పాటు చేయడమైనది.
ఈ నెల 18 నుండి జాతర పూర్తి అయ్యేంత వరకు బస్సులు నడపనున్నారు. ఈ సందర్బంగా తహసీల్దార్ వీరాస్వామి మేడారం మహా జాతర ను దృష్టిలో పెట్టుకొని భక్తుల సౌకర్యర్థం ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.