ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఆమెకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు. రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ పోస్ట్ పెట్టాడు. పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన యువతీయువకులతో ఫోర్బ్స్ పత్రిక ఈ జాబితాను రూపొందిస్తుంది.
