మన్యం న్యూస్ గుండాల: సార్వత్రిక సమ్మెకు మద్దతు పలికిన విద్యార్థి సంఘాలు. భారత్ బంద్ నేపథ్యంలో పిడిఎస్యు, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో నిరసన కార్యక్రమాన్ని విద్యార్థి సంఘ నేతలు ఎస్కే షాహిద్, బానోత్ నరేందర్ చేపట్టారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అన్నారు, మోడీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలపై విద్యార్థులు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో నసీర్, రాకేష్, వినయ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు
