మన్యం న్యూస్ కరకగూడెం: మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత,జన హృదయ నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్రశేఖర రావు 70వ పుట్టినరోజు వేడుకలు మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి తెలంగాణ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రావుల.సోమయ్య మాట్లాడుతూ కల్వకుంట్ల చంద్రశేఖర రావు 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఆ తెచ్చుకున్న తెలంగాణలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తగిన రీతిలో అమలుపరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత దేశంలో ఒక కేసీఆర్ గారికి దక్కుతుంది తప్ప మరెవరికి ఉండదని అట్లనే కెసిఆర్ కి ఆ శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని వారు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని మరల ముఖ్యమంత్రిగా చేయాలని రాష్ట్ర ప్రజలందరినీ వేడుకుంటూ బిఆర్ఎస్ పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు చిట్టీ సతీష్, ఎస్సి సెల్ అధ్యక్షులు నిట్ట ఏడుకొండలు, బైరిశెట్టి చిరంజీవి, మాజీ సర్పంచ్ లు పాయం నర్సింహారావు,కొమరం విశ్వనాధం మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.