పుష్ప – 3 సినిమాపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఇండియన్ సినిమా తరపున బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌కి బన్నీ వెళ్లారు. ఫెస్టివల్లో పుష్ప సినిమాని ప్రదర్శించిన అనంతరం ఆయన స్పందించారు. తమ చిత్ర బృందం పుష్పను ఒక ఫ్రాంచైజీల తెరకెక్కించే విధంగా సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో పుష్ప-3 కచ్చితంగా ఉండనుందని తెలుస్తోంది. పుష్ప-2 ఆగస్టు 15 విడుదల కానున్న విషయం తెలిసిందే.
