మన్యం న్యూస్ గుండాల: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మన్యం న్యూస్ రిపోర్టర్ గడ్డం వీరన్న ఆధ్వర్యంలో చేపట్టారు. ఆసుపత్రికి వచ్చిన పలువురికి పండ్లను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. కెసిఆర్ జన్మదినాన్ని మన్యం న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనందంగా ఉందని రిపోర్టర్ గడ్డం వీరన్న అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారావు, మాజీ ఉపసర్పంచ్ ఉపేందర్, ఎస్టీ సెల్ నాయకులు లక్ష్మీనారాయణ, గుగ్గల రాంబాబు, ఈసం సుధాకర్, కృష్ణ, బొబ్బిలి నగేష్, జోగా బాబు,ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
