టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయిపల్లవి- నాగచైతన్య కాంబినేషన్‌లో 2021లో లవ్ స్టోరీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అయితే ఇందులోని ఓ ముద్దు సీన్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా దీనిపై సాయి పల్లవి స్పందించింది. ‘ఆ సీన్ నా వల్ల లేట్ అయింది. నేను ముద్దు పెట్టను అని చెప్పాను. అయితే మేము లిప్ కిస్ పెట్టుకోకున్నా గానీ పెట్టినట్లుగా చేయడానికి చాలా టైమ్ పట్టింది’ అని చెప్పుకొచ్చింది.
