తన భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ ‘చిరు’ కవిత రాసి శుభాకాంక్షలు చెప్పారు.
‘నా జీవన రేఖ
నా సౌభాగ్య రేఖ
నా భాగస్వామి సురేఖ
నా జీవిత రేఖ
నా శక్తికి మూలస్తంభం సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చిరంజీవి ఓ కవిత రాశారు. తన సతీమణికి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మెగాస్టార్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కవితకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.