మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆ సినిమా సంగతులను పంచుకున్నారు. ‘నా జీవితానికి ఒక మంచి మలుపు ఇచ్చిన మూవీ సీతారామ. రష్మిక, దుల్కర్ సల్మాన్ ద్వారా కేరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సినిమాల ఎంపికలో వారిద్దరినే స్ఫూర్తిగా తీసుకుంటాను’ అని మృణాల్ చెప్పుకొచ్చారు. కాగా, ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుంది.