మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ ‘గాంజా శంకర్’. ఈ మూవీ యూనిట్ కు తెలంగాణ నార్కొటిక్ బ్యూరో (TSNAB) బిగ్ షాక్ ఇచ్చింది. సినిమా పేరు మార్చాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు ఇచ్చింది. సినిమాలో గంజాయి, డ్రగ్స్ ని ప్రోత్సహించే సన్నివేశాలు చూపించొద్దని సూచించింది. సినిమా ట్రైలర్ కూడా యువతను ప్రభావం చేసేలా ఉందని పేర్కొంది. సినిమా ఆర్టిస్టులు, సెలబ్రెటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటిసుల్లో పేర్కొంది.
