UPDATES  

 ఆ రైతులకు గ్లిజరిన్‌ అవసరం రాలేదు..

వివాదాల నడుమ విడుదలైన ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా గురించి ఆ చిత్ర నిర్మాత కంఠమనేని రవిశంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో స్థానిక అమరావతి రైతులే నటించారని, దీంతో ఆ రైతులకు గ్లిజరిన్‌ అవసరం రాలేదన్నారు. న్యాయం కోసం వారు చేసిన పోరాటాన్ని, పడిన కష్టాలను తలచుకోగానే వారికి కన్నీళ్లు వాటంతట అవే వచ్చాయని ఆయన తెలిపారు. ఈ మూవీలో అమరావతి రైతులకు జరిగిన అన్యాయం, అనుభవించిన కష్టాల్లో 10% మాత్రమే చూపగలిగామని ఆయన అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !